చంద్రబాబును అరెస్ట్ చేసి నెల రోజులు పూర్తి అయినా జగన్ ప్రభుత్వం ఏ ఒక్క ఆధారాన్ని కూడా న్యాయస్థానానికి సమర్పించకలేకపోయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ కర్నూలు రూరల్ మండలం బి.తాండ్రపాడులో చేపట్టిన నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సోమిశేట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అసలు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో, ఏం చేయాలని అనుకుంటున్నారో అర్ధంకావడం లేదన్నారు. తండి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్ రూ. 43 వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఈడీ కేసుల్లో కూరుకుపోయి 16 నెలలు జైలు జీవితం గడిపిన బెయిల్ ముఖ్యమంత్రి జగన్ ఒక అవినీతి పరుడు అని ఏద్దేవా చేశారు. అధికారం శాశ్వతం కాదని, 6 నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, అపుడు వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కు తాను ఎందుకు కావాలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన వివరాలు విని నివ్వెరపోయామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. అరాచక ఆంధ్రప్రదేశ్, అప్పుల రాష్ట్రంగా మార్చినందుకు మళ్లీ ఆయన రావాలా?.. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకపాలనతో అందరినీ అణగదొక్కేందుకు మళ్లీ రావాలా? అని ప్రశ్నించారు.