219 మందితో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులను చంద్రబాబు ఎంపిక చేసారు. 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు రాష్ట్ర కమిటీలలో ఉన్నారు. 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారిని నియమించారు. బడుగు, బలహీన, ఎస్సీలకు 61 శాతం పదవులు ఇచ్చారు.
ఈ రాష్ట్ర కమిటీలో 50 ఉపకులాలకు ప్రాధాన్యం ఇచ్చారు అధినేత. బీసిలకు 41 శాతం, ఎస్సీలకు 11 శాతం, ఎస్టీలకు 3 శాతం పదవులు ఇచ్చారు. మైనార్టీలకు 6 శాతం మందికి కొత్త కమిటీలో చోటు కల్పించింది టీడీపీ అధిష్టానం. కమిటీలో ఉన్నవారి సగటు వయసు 48 ఏళ్లు గా ఉండటం గమనార్హం. మహిళలకు కూడా ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత కల్పించారు.