13ఏళ్ల తర్వాత హిందీలో రీమేక్ అవుతున్న బొమ్మరిల్లు…!

తెలుగులో బ్లాక్‌ బ్లస్టర్‌గా నిలిచిన బొమ్మరిల్లు సినిమాను.. ఇట్స్ మై లైఫ్‌ పేరుతో హిందీలోనూ రిమేక్‌ చేశారు. ఎప్పుడో 2007లోనే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇన్నేళ్ల తర్వాత నవంబర్‌ 29న జీ సినిమా టీవీ ఛానల్లో విడుదలవుతోంది. బోనీకపూర్‌ నిర్మాతగా అన్నీస్‌ బజ్మి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. ఎట్టకేలకు ఆడియన్స్‌ ముందుకు రాబోతోంది. కాగా, తెలుగులో హీరోయిన్‌గా నటించిన జెనీలియానే.. హిందీ రిమేక్‌లోనూ నటించింది.

ప్రకాశ్‌ రాజ్‌ పాత్రలో నానా పటేకర్‌.. సిద్ధార్త్‌ పాత్రలో హర్మన్‌ బవేజా నటించారు. కాగా, నవంబర్‌ 29న జీ సినిమాలో నేరుగా దీన్ని ప్రసారం చేయనున్నట్లు నిర్మాత బోనీకపూర్‌ వెల్లడించారు. దాదాపు పదమూడేళ్ల పాటు ఈ సినిమా విడుదలవుతుండటం విశేషం. యూత్ ఈ సినిమాకి అప్పట్లో ఒక రేంజ్ లో ఎడిక్ట్ అయిపోయారు.ఈ సినిమా ప్రభావం చాలా మంది నిజ జీవితంలో కూడా చూపించింది.