BREAKING : తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!

-

తెలంగాణ విద్యాశాఖ పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అకాడమిక్ క్యాలెండర్ ను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా విడుదల చేశారు. ఏడాది కాలంలో 213 రోజులు పాఠశాల పనిదినాలు గా ప్రకటించారు. 47 రోజులు ఆన్లైన్ ద్వారా 116 రోజులు ప్రత్యేక తరగతుల ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పాఠశాల చివరి వర్కింగ్ డే ఏప్రిల్ 23 అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పదోతరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 25 లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మార్చి లేదా ఏప్రిల్ నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు మళ్లీ వేసవికాలం సెలవులను ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా అక్టోబర్ 6 నుండి అక్టోబర్ 17 వరకు 12 రోజుల పాటు దసరా సెలవులు ఉండబోతున్నాయని స్పష్టంచేశారు. జనవరి 11 నుండి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news