గత కొన్ని రోజులుగా తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది..ఆ సమయం రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లో టెన్త్ విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడబోతున్నారు. జూన్ 30 గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,09,275 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వీరిలో 99 శాతం మంది హాజరయ్యారు. కరోనా కారణంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను 11 పేపర్ల పరీక్షకు బదులు 6 పేపర్లకు కుదించారు. సిలబస్‌ను సైతం 30 శాతం తగ్గించి ప్రశ్నపత్రాల్లో ఛాయిస్ పెంచారు.గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలు లేకుండానే నిర్వహించకుండానే విద్యార్థులను పాస్ చేశారు.
ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణత సాధిస్తారన్న విషయంపై సర్వాత్రా ఆసక్తి నెలకొంది.టెన్త్ విద్యార్థులు తమ ఫలితాలను www.bse.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చు..