అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు, రాబర్ట్ ట్రంప్ కన్నుమూసారు. ఆయన కుటుంబానికి దాదాపుగా దూరంగా ఉంటారు. న్యూయార్క్ లో ఆయన శనివారం రాత్రి కన్నుమూసారు. ఈ విషయాన్ని ట్రంప్ ప్రకటించారు. గత కొంత కాలంగా రాబర్ట్ ట్రంప్ అనారోగ్యం బారిన పడ్డారు. అప్పటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. నా అద్భుతమైన సోదరుడు రాబర్ట్ ఈ రాత్రి కన్నుమూసినట్టు నేను మీకు చెప్తున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు.
“అతను నా సోదరుడు మాత్రమే కాదు, అతను నాకు మంచి స్నేహితుడు. అతను చాలా గొప్ప వ్యక్తి. కాని మేము మళ్ళీ కలుస్తాము. అతని జ్ఞాపకాలు నా హృదయంలో శాశ్వతంగా ఉంటాయి అని ట్రంప్ పేర్కొన్నారు. రాబర్ట్, ఐ లవ్ యు. విశ్రాంతి తీసుకోండి. ట్రంప్ కంటే ఆయన మూడేళ్ళు చిన్న వాడు. ఆయన గత కొన్నేళ్ళుగా ఐసియులో చికిత్స పొందుతున్నారు.