దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) లో వామపక్ష “దుండగులు” తమ కార్మికులపై, విద్యార్థులపై జరిగిన దాడులకు సంబంధించి సాక్ష్యం అని పేర్కొంటూ ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యా పరిషత్ (ఎబివిపి) ఒక కొత్త వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆదివారం రాత్రి క్యాంపస్‌లో డజన్ల కొద్దీ ముసుగు, సాయుధ గూండాలు చేసిన దాడులపై ఎబివిపిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
ఒక వీడియోను ట్వీట్ చేయగా దాంట్లో, కొంత మంది పరుగులు తీస్తున్నట్టు కనపడుతుంది. “జెఎన్‌యులో వామపక్ష దుండగులు విద్యార్థులు మరియు కార్యకర్తలను ఎలా కొట్టారో దానికి స్పష్టమైన రుజువు” అని పేర్కొంది. ఎబివిపి కార్యకర్త అయిన శివమ్‌ను, కమ్మీ గూండాలు వెంబడించి దారుణంగా దాడి చేశారు. మీరు విద్యార్థుల హక్కుల కోసం నిలబడితే వామపక్షాలు మీకు ఇదే చేస్తాయిని ఆరోపించింది.
“వామపక్ష దుండగుల హింసాత్మక దాడిలో” ఒక ఎబివిపి సభ్యుడు శివమ్ తల మరియు మెడపై గాయాలు అయ్యాయని ఆరోపించింది. వామపక్ష సంస్థలను నిషేధించాలని పిలుపునిచ్చినట్లు పేర్కొంది. ఇక ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీసింది. వివరణ ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల శాఖ ఆదేశాలు జారి చేసింది. ఈ ఘటనలో 18 మంది విద్యార్ధులు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
Shivam received severe injuries on head, neck due to the violent attack by the leftist thugs. It is high time these left organisations are banned so that campuses can be violence-free and can focus on education and holistic development of students. #BanAISASFI #OpposeLeftViolence pic.twitter.com/zwt4fCLVxY
— ABVP (@ABVPVoice) January 6, 2020