బ్రేకింగ్: తారకరత్న ఆరోగ్య స్థితిపై డాక్టర్స్ ఏమన్నారంటే.?

-

నటుడు నందమూరి వారసుడు తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ కుప్పంలో ప్రారంభించిన యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొని.. కొద్దిసేపు నడవగానే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పరిస్థితి విషమంగా ఉండడంతో కుప్పం నుండి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ఆయనను తరలించారు. ప్రస్తుతం ఆయనను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు ప్రయత్నిస్తున్నారని ఇప్పటికే నందమూరి కుటుంబ సభ్యులకు కూడా మీడియాతో వెల్లడించారు.

నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, కుటుంబ సభ్యులు ఆకాంక్షిస్తున్న సమయంలో తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ.. అంతా బాగానే ఉందని ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు వైద్యులు కూడా వెల్లడించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తూ అంతా బాగానే ఉందని నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కూడా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. దీంతో అభిమానులు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ అని ఊపిరి పీల్చుకున్నారు.

ఇప్పుడు నారాయణ హాస్పిటల్ సిబ్బంది స్పందిస్తూ “ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నాం. అతనికి ఇంకా ఎలాంటి ఎక్మో సపోర్ట్ పెట్టలేదు” అని తెలిపినట్లు సమాచారం. ఏది ఏమైనా తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. వైద్యులు ఇంకా తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని చెప్పడంతో అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు . తాజాగా విడుదల చేసిన బులిటెన్ ఇప్పుడు మరింత వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news