మేనేజర్‌ వ్యవస్థపై జూకర్‌బర్గ్‌ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్స్ ఉన్నట్టేనా..?

-

ఐటీ కంపెనీల్లో ఉద్యోగులపై యాజమాన్యం లేఆఫ్స్ కొరడా ఝుళిపిస్తూనే ఉంది. రోజుకో కంపెనీ తమ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తోంది. ఇటీవలే 11వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించిన మెటా సంస్థ మరికొంత మందిని ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మెటా సంస్థ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ చేసిన వ్యాఖ్యలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి.

మెటా సంస్థల్లో మేనేజర్ల వ్యవస్థపై జుకర్​బర్గ్​ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తన సంస్థ ఉద్యోగులతో సమావేశం సందర్భంగా వివిధ స్థాయిల్లో మేనేజర్లపై మేనేజర్లు ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మధ్యస్థాయి మేనేజర్లపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నారనే కథనాలు వస్తున్నాయి.

‘పనిచేసే వారిని మేనేజ్‌ చేసే మేనేజర్లు, వారిని నియంత్రించే మరికొంత మంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్‌ చేసే మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజిమెంట్‌ వ్యవస్థ అవసరమని అనుకోవడం లేదు’ అని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈసారి మేనేజర్లకు పింక్‌ స్లిప్పులు ఇవ్వడం ఖాయమని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news