బ్రేకింగ్: మహిళ ఆత్మహత్యాయత్నం, ఇరుక్కున వైసీపీ ఎమ్మెల్యే కొడుకు…!

ఈ మధ్య కాలంలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు… ఏదోక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే కొడుకు వివాదంలో చిక్కుకున్నాడు. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు ఓబులరెడ్డి పై ఆరోపణలు వస్తున్నాయి. నంద్యాలలో 3 కోట్లు విలువ చేసే 50 సెంట్ల భూమి బంధువుల చేత రిజిస్టర్ చేయించుకున్నారని శ్రీలక్ష్మీ దేవి అనే మహిళ ఆత్మహత్యయత్నం చేసింది.

ప్రస్తుతం సదరు మహిళ అపస్మారక స్థితిలో ఉందని సమాచారం. నంద్యాలలో ఓ ప్రైవేట్ అసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. విలువైన స్థలం లాగేసుకుంటున్నారని ఆత్మహత్యకు ఆమె ప్రయత్నించారు అని ఆమె కుమార్తె భాగ్యలక్ష్మి తెలిపారు. మాకు ఉన్న ఒకే ఒక ఆధారం పోతే మేము రోడ్డున పడతాం అని భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే కేసు నమోదు చేసారా లేదా అనే దానిపై ఇంకా సమాచారం లేదు.