విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది.. మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో మంత్రుల కార్లపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు జనసేన కార్యకర్తలు. జనవాని కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్టుకి చేరుకున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు కార్యకర్తలు, అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఫ్లకార్డులతో నినాదాలు చేస్తుండగా అదే సమయంలో విశాఖ ఎయిర్పోర్టు దగ్గరికి చేరుకున్నారు మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి. ఈ నేపథ్యంలోనే వారి కారులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking: వైసిపి మంత్రులు రోజా, జోగి రమేష్, వైవి సుబ్బారెడ్డి కార్ల పై రాళ్ల దాడి !
By Karthik
-
Previous article