ఏపీ : గ్యాంగ్ రేప్ కేసులో ట్విస్ట్..పోలీసుల అదుపులో 7గురు..!

ఏపీలోని గుంటూరు జిల్లా మేడికొండూరు ప‌రిధిలోని పాల‌డుగు క్రాస్ రోడ్డు స‌మీపంలో ఇటీవ‌ల జ‌రిగిన సామూహిక హ‌త్యాచారం కేసులో పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. కొర్ర‌పాడులోని పాత నేర‌స్థుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం ఘ‌ట‌న‌లో వీరి ప్ర‌మేయం ఉండొచ్చ‌ని పోలీసులు భావిస్తున్నారు. ఘ‌ట‌న జరిగిన ప్ర‌దేశంలో సెల ఫోన్ సిగ్న‌ల్స్ ఇత‌ర ఆధారాలను బ‌ట్టి నేర‌స్థుల‌పై పోలీసులు ప్ర‌శ్న‌లు కురిపిస్తున్నారు.

అత్యాచారం
అత్యాచారం

అయితే ఈ విష‌యాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించ‌లేదు. ఇదిలా ఉండ‌గా పాల‌డుగు క్రాస్ రోడ్డు స‌మీపంలో భ‌ర్త‌తో వెళుతున్న వివాహిత‌పై దుండ‌గులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. భ‌ర్త‌ను అతిదారుణంగా కొట్టిన దుండ‌గులు కాళ్లూ చేతులూ క‌ట్టేసి మ‌హిళ‌పై అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌నపై ఏపీ స‌ర్కార్ సీర‌య‌స్ గా ఉంది. నింధితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని రాష్ట్ర‌వ్యాప్తంగా డిమాండ్ లు వ‌స్తున్నాయి.