బ్రిస్టల్ వన్ డే: ప్రతీకార దాహంతో ఆస్ట్రేలియా మహిళల జట్టు… !

-

మహిళల యాషెస్ సిరీస్ లో భాగంగా ఒక టెస్ట్, మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లను ఇంగ్లాండ్ వేదికగా ఆడదానికి ఆస్ట్రేలియా మహిళలు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఏకైక టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మహిళలు ఆల్ రౌండ్ ప్రతిభాతి మట్టికరిపించింది. అనంతరం జరిగిన టీ 20 సిరీస్ లో మాత్రం ఇంగ్లాండ్ తేరుకుని ఆస్ట్రేలియాను 2 – 1 తేడాతో ఓడించి సిరీస్ ను చేజిక్కించుకుంది. ఈ సిరీస్ లో ఓడిపోవడంతో ఆస్ట్రేలియా దెబ్బ తిన్న పులుల్లా ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా కాసేపటి క్రితమే బ్రిస్టల్ వేదికగా మొదలైన మొదటి వన్ డే లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఆరంభములోనే కెప్టెన్ అలీసా హీలీ వికెట్ ను కోల్పోవడం పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయిన పెర్రీ మరియు లీచ్ ఫీల్డ్ లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు.

 

 

ఈ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేయాలనీ లక్ష్యంగా ఆస్ట్రేలియా మహిళలు ఉన్నారు. మరి వారి కోరిక తీరుతుందా ? ఇంగ్లాండ్ మహిళలు వన్ డే సిరీస్ లో బోణీ కొడతారా అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news