పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న తాజాగా చిత్రం “బ్రో”… ఈ సినిమాకు తమిళ నటుడు మరియు దర్శకుడి సముథ్రఖని దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ఒక సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేసింది. “మై డియర్ మార్కండేయ” అంటూ సాగే ఈ పాటకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది అని రివ్యూలు వస్తున్నాయి. ఈ పాత రిలీజ్ అయిన కొంత సేపటికే యూట్యూబ్ లో 10 లక్షల మంది వీక్షించారట. ఇది నిజంగా ఒక రికార్డ్ అని చెప్పాలి. ఇక ఈ సాంగ్ లో మనల్ని ఆపేది మగాడెవడు బ్రో అన్న లైన్ కోసం అయితే అభిమానులు ఫిదా అయిపోయారంతా. ఇక ఈ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ డ్యాన్స్ తో ఇరగదీశాడని తెలుస్తోంది.
ఇక ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డ్ లను హస్తగత చేసుకుంటుందో తెలియాలి. కాగా ఈ సినిమా తమిళ సినిమా వినోదయ సీతం కు రీమేక్ అని తెలిసిందే.