తెలంగాణ అధికార పార్టీ వివాదాస్పద BRS ఎమ్మెల్యే రాజయ్య ఇటీవల సర్పంచ్ ను వేధించాడన్న అపవాదును మూటగట్టుకున్నాడు. ఆ విషయంలో రాజయ్యకు తన నియోజకవర్గంలోనే కాక.. రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు ఎదుర్జ్కోవాల్సి వచ్చింది. దీని పట్ల BRS అధిష్టానం కేవలం మందలించి వదిలేసింది.. కాబట్టి సరిపోయింది లేకుంటే పరిస్థితి సస్పెన్షన్ వరకు వెళ్ళేది. అయితే ఆ వార్తలు మరిచిపోకముందే మరో వివాదంలో ఈయన చిక్కుకున్నాడని తెలుస్తోంది. తాజాగా BRS పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణాలో రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఈయన ఇంతకీ ఏమన్నాడంటే… మీటింగ్ లో మాట్లాడుతూ “బి ఆర్ ఎస్సే .. కాంగ్రెస్ ..కాంగ్రెస్సే బి ఆర్ ఎస్ ” అన్నాడు… ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీల మధ్యన చిచ్చు పెడుతున్నాయని చెప్పాలి. ఈ మాటలు విన్న కార్యకర్తలు , నాయకులు ఆశ్చర్యపోతున్నారు..ఈ విషయంలో మాత్రం కేసీఆర్ కీలక చర్యలు తీసుకుంటాడు.