ప్రగతి భవన్ కు ఎమ్మెల్సీ కవిత.. కేసీఆర్ తో భేటీ

-

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ కు వెళ్లారు. హైదరాబాద్ లోని తన నివాసం నుంచి నేరుగా ప్రగతి భవన్ వెళ్లారు. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. దిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఈడీ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ముఖ్యమంత్రితో కవిత భేటీ అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీ ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. దిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ నుంచి నోటీసులు అందుకున్న సమయంలోనూ కవిత సీఎం కేసీఆర్ తో భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈడీ ఛార్జిషీటులో కవిత పేరు ప్రస్తావించడంపై ప్రతిపక్ష నేతలు స్పందించారు. లిక్కర్ క్వీన్ కవిత పేరును ఈడీ ఛార్జిషీటులో 28 సార్లు ప్రస్తావించారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనిపై కవిత స్పందిస్తూ.. 28 సార్లు వచ్చినా.. 28 వేల సార్లు వచ్చినా.. అబద్ధం నిజం కాదని రిప్లై ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news