బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 10 చెన్నై వెళ్లనున్నారు. 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై ఓ సంస్థ నిర్వహించే చర్చలో కవిత పాల్గొననున్నారు. ఈ చర్చలో బీఆర్ఎస్ జాతీయ ఎజెండాను వివరించనున్నారు.
ఈ చర్చలో కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచిశివ, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పాల్గొంటారని సమాచారం. ఆ వేదిక ద్వారా దళితబంధు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత, కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కవిత ప్రసంగించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. బీఆర్ఎస్ను అన్ని రాష్ట్రాల్లోకి తీసుకువెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. మహారాష్ట్ర వ్యాప్తంగా వారం, పది రోజుల్లో ఇంటింటికి బీఆర్ఎస్ ప్రచారం ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు అవకాశం ఇవ్వాలని కోరారు. త్వరలోనే ఒడిశా, కర్ణాటకల్లోనూ సభ నిర్వహించే అవకాశాలున్నాయి.