వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి. గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్ద మంత్రి తలసాని ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. మరోవైపు ట్యాంక్‌బండ్ దగ్గర ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. పార్టీ నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కేపీ వివేకానందరెడ్డిలు వారి సొంత నియోజకవర్గాల్లో కార్యకర్తలతో కలిసి ధర్నా చేశారు.
గ్యాస్ సిలిండర్ ధరలను నిరసిస్తూ మేడ్చల్ మల్కాజ్‌గిరిలో నిర్వహించిన ధర్నాకు మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో బీఆర్ఎస్ వంటా వార్పు కార్యక్రమం చేపట్టింది.
పెద్ద ఎత్తన పాల్గొన్న మహిళలు తరచూ సిలిండర్ ధరలు పెంచూతూ.. సామాన్యుల నడ్డి విరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ చేపట్టిన ఈ ఆందోళనల్లో.. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.