లోక్ సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్న వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల కామెంట్లకు మంత్రి కోమటిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ,బాధతో ఏం మాట్లాడాలో తెలియక.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ ఏవేవో మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నల్లగొండ, భువనగిరి లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అవుతోందని అన్నారు.

గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాలోని ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరిన్నీ ఎంపీ సీట్లు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సీట్ల కోసం పార్టీలో జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా పని చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news