తెలంగాణలో త్వరలో జరగనున్న శాసనసమండలి ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ తన మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికలో మిత్రపక్షమైన ఎంఐఎంకు పూర్తి మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఎంఐఎం చేసిన అభ్యర్థన మేరకు భారాస మద్దతు ప్రకటించింది. వచ్చే నెల 13న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంతో పాటు హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.