బీఆర్ఎస్ ఘోర ఓటమి..పనిచేయని కేసీఆర్ వ్యూహం

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. బిజెపి తరఫున ఎనిమిది మంది లోక్సభ స్థానాలలో విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ తరపున కూడా 8 మంది ఎంపీ అభ్యర్థులుగా విజయం సాధించారు. ఎంఐఎం అధ్యక్షుడు అసవుద్దీన్ ఓవైసీ మాధవి లత పై గెలిచారు. కానీ ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది.

ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయి అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీ ఈసారి అయినా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి కేడర్లో ఉత్సాహం నింపుదామనుకున్న కేసీఆర్ వ్యూహం పనిచేయలేదు. స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసినా ఓట్లు రాలలేదు. దీనికితోడు మేడిగడ్డ కుంగడం, లిక్కర్ స్కాం, ఫోన్ ట్యాపింగ్ వంటివి బీఆర్ఎస్ కు మైనస్ గా మారాయి. లోక్ సభ ఎన్నికలు కావడంతో జాతీయ పార్టీలవైపే ప్రజలు మొగ్గుచూపడంతో బీఆర్ఎస్ పూర్తిగా వెనకబడింది.

Read more RELATED
Recommended to you

Latest news