ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తనపై ఉన్న అక్రమాస్తుల కేసులో తొలిసారిగా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు విచారణకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఏ2 ముద్దాయి విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, పారిశ్రామికవేత్త ఇందు శ్యాంప్రసాద్ రెడ్డి, రిటైర్ట్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ తదితరులు కూడా కోర్టుకు వచ్చారు. ఇదిలా ఉంటే.. వైఎస్ జగన్ కు టైమ్ దగ్గర పడిందని ‘రావాలి జగన్… కావాలి జగన్’ అని జైలు గోడలు పిలుస్తున్నాయని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు.
ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “జగన్ మోహన్ రెడ్డి గారూ… మీరు కోర్టుకి హాజరయ్యి జడ్జిగారి ముందు చేతులు కట్టుకున్న విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ట్విట్టర్ లో చాలా కష్టపడుతున్నారు. 60 లక్షల ఖర్చు అని బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఖర్చు ఎంత చూపిస్తారు? ఇక టైమ్ దగ్గర పడింది. జైలు అంటుంది రావాలి జగన్… కావాలి జగన్ అని” అంటూ సెటైర్లు వేశారు.