ప్రపంచమంతా కరోనా తో పోరాడుతుంటే.. ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం రాజకీయంగా ఒకరితో ఒకరు తలపడుతున్నారు. అరెస్టులతో, నిరసనలతో, విమర్శలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అయితే జరుగుతున్న పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసినంత మాత్రాన తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని భయపెట్టలేరని ఆయన స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో హిట్లర్ పాలన కొనసాగుతోందని, ఏపీని అరాచక ఆంధ్రప్రదేశ్ మార్చారని మండిపడ్డారు. జగన్ కాస్త ముందు పుట్టి ఉంటే హిట్లర్ పేరు ప్రపంచానికి తెలిసేది కాదని ఎద్దేవా చేశారు. కౌరవులు వందమంది ఉన్నట్టు వైసీపీకి 151 మంది ఉన్నారని, కానీ ధర్మం చంద్రబాబు పక్షానే ఉందని వ్యాఖ్యానించారు. మహానాడులో చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేయడంతో, బీసీలను టీడీపీకి దూరం చేయాలన్న దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారంటూ జగన్ పై మండిపడ్డారు.
100 మంది కౌరవులు.. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు..!
-