పోలవరం మీద నిర్మలమ్మ హామీ ఇచ్చారు : బుగ్గన

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ భేటీ పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని విషయాలు వివరించానని, పోలవరం  సవరించిన అంచనాలకు ఆమోదం పై పరిశీలిస్తామని ఆమె హామీ ఇచ్చారని అన్నారు. ప్రాజెక్టు కోసం రాష్ట్రం ఖర్చు చేసిన 4 వేల కోట్ల రూపాయలలో, గత వారం ఏలాంటి షరతులు లేకుండానే 2,300 కోట్ల రూపాయలకు ఇటీవల కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని ఆయన అన్నారు.

2013-14 అంచనాలకు టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ నాటి అంచనాల కంటే భూసేకరణకే 17 వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతుందమో అమ్మరి. 2013-14 ఆర్ధిక సంవత్సరం అంచనాల ప్రకారం  అయితే ఇబ్బంది అవుతుందని కేంద్ర మంత్రికి చెప్పామని సవరించిన అంచనా కమిటీ నివేదికలను కేంద్రానికి ఇచ్చామన్న ఆయన వాటిని సమీక్షించి నిధులు మంజూరు చేయాలని కోరామని అన్నారు.