రజినికి బంపర్ ఆఫర్‌…భారీ షాక్…రెండు రెడీగా ఉన్నాయా…

-

విడదల రజిని…ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల్లో కాస్త ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న ఎమ్మెల్యే. తొలిసారి ఎన్నికల బరిలో దిగి, చిలకలూరిపేటలో టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుని చిత్తు చేసిన రజిని, తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా సరే దూకుడుగా రాజకీయం చేస్తూ, తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. ఇలా రెండేళ్లలోనే రాష్ట్రంలో హైలైట్ అయిన రజిని…ఊహించని విధంగా మంత్రి రేసులోకి కూడా వచ్చేశారు.

vidadhala rajini

త్వరలోనే జగన్…తన మంత్రివర్గంలో మార్పులు చేయనున్న సంగతి తెలిసిందే. ఇక అప్పుడు రజినికి బంపర్ ఆఫర్ ఉంటుందని, ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి మంత్రివర్గంలో మేకతోటి సుచరిత మాత్రమే ఉన్నారు. దీంతో గుంటూరు జిల్లాకు ఒకటి లేదా రెండు పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో తాను ఛాన్స్ కొట్టేయాలని రజిని కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

బీసీ మహిళా కోటాలో రజినికి పదవి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ బంపర్ ఆఫర్ రజినికి వస్తుందా? లేదా? అనేది కొన్ని నెలల్లో తెలిసిపోతుంది. ఈ బంపర్ ఆఫర్ గురించి పక్కనబెడితే, రజినికి భారీ షాక్ కూడా ఒకటి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే వస్తున్న పలు సర్వేల్లో చిలకలూరిపేటలో రజినికి అంత అనుకూల పరిస్తితులు లేవని తెలుస్తోంది. ఇక్కడ సొంత పార్టీ నాయకులతో విభేదాలు, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు పుంజుకోవడం లాంటి అంశాలు రజినికి మైనస్ అయ్యేలా కనిపిస్తున్నాయని అంటున్నారు.

గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో రజిని గెలిచేశారని, ఈ సారి ఎన్నికల్లో మాత్రం రజినికి గెలుపు అంత సులువు కాదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రజినికి భారీ షాక్ తగిలిన ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. మరి చూడాలి రజినికి బంపర్ ఆఫర్ వస్తుందో? లేక భారీ షాక్ తగులుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news