బంపర్ ఆఫర్.. బైక్ ధరకే కారు..!

కారులో షీకారుకు వెళ్లాలని ప్రతి ఒక్కరికి మహా సరదా.. అందుకే చాలా మంది కారు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కానీ, బడ్జెట్ కారణంగా వారు తమ కలను సాకారం చేసుకోలేకపోతుంటారు. అలాంటి వారి కోసమే పలు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బైక్ కొనుగోలు చేసిన ధరకే కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు. ఇంత తక్కువ ధరలో కారు ఎలా కొనుగోలు చేస్తామనుకుంటున్నారా.. అయితే ఏ కార్లు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం..

మీ దగ్గర బడ్జెట్ తక్కువలో ఉంది.. బైక్ ధరలోనే కారు కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీ కోసం పలు వెబ్ సైట్లు తక్కువ ధరకే కార్లను అందుబాటులో తీసుకొచ్చాయి. అయితే ఇవి సెకండ్ హ్యాండ్ కార్లు. ఈ కార్లను మీరు బైక్ కొన్న ధరకే కొనుగోలు చేసి మీ ఇంటికి తీసుకెళ్లొచ్చు. ట్రూవ్యాల్యూ అనే వెబ్ సైట్ లో మీరు తక్కువ ధరకే మారుతీ సుజుకీకి చెందిన కార్లను కొనుగోలు చేసుకోవచ్చు. తక్కువ ధరకే కారు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ట్రూవ్యాల్యూ మారుతీ వ్యాగనార్ పెట్రోల్ వేరియంట్ కారును అందుబాటులో ఉంచింది. ఈ కారు ధర రూ.85,000 ఉంటుంది. ఇప్పటివరకు ఈ కారు 1,17,012 కిలోమీటర్ల వరకు ప్రయాణించింది. 2005కి చెందిన ఈ మోడల్ కారు ఫుల్ కండీషన్ లో ఉంది. వీటితో పాటు ట్రూవ్యాల్యూ మారుతీ సుజుకీకి చెందిన మరో కారును కూడా తక్కువ ధరలో ఉంచింది. మారుతీ ఆల్టో పెట్రోల్ వేరియంట్ కారు తక్కువ ధరకే అందిస్తోంది. ఈ కారు ధర రూ.65 వేలు. 2006కి చెందిన ఈ మోడల్ కారు తక్కువగానే తిరిగింది.

మారుతీ సుజుకీ జెన్ పెట్రోల్ వేరియంట్ కారును కూడా వెబ్ సైట్ లో ఉంచారు. రూ.75 వేలకే ఈ కారును సొంతం చేసుకోవచ్చు. 2009కి చెందిన మోడల్ కారు ఎక్కువ దూరం ప్రయాణించలేదు. సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలనుకుంటే ట్రూవ్యాల్యూ వెబ్ సైట్ లో లాగిన్ అయి కారుని ఇంటికి తెచ్చేసుకోండి.