చిరంజీవికి కరోనా.. టెన్షన్ లో టీఆర్ఎస్ అగ్రనేతలు !

ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ అనే సంగతి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడంతో టిఆర్ఎస్ అగ్రనేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఆయన రెండు రోజుల క్రితమే టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రెండు గంటల పాటు భేటీ అయ్యారు. గతంలో వచ్చిన హైదరాబాదు వరదలకు సంబంధించిన విరాళం అందించేందుకు తన సహచర నటుడు నాగార్జునతో కలిసి ప్రగతి భవన్ లో కేసీఆర్ ని కలిశారు. అయితే ఈ సందర్భంగా మీడియాకి కొన్ని పిక్స్ రిలీజ్ కూడా చేశారు.

ఈ పిక్స్ లో ఒక్కరి కూడా మాస్క్ లు పెట్టుకొని కనబడలేదు. దీంతో ఇప్పుడు ఈ భేటీలో ఉన్న వాళ్లందరికీ కరోనా టెన్షన్ పట్టుకుంది అని చెబుతున్నారు. ఇప్పటికే ఈ భేటీలో పాల్గొన్న టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కరోనా టెస్ట్ చేయించుకోగా ఆయనకి నెగటివ్ అని తేలింది. ఇక సీఎం కేసీఆర్ కూడా ముందస్తు జాగ్రత్తగా టెస్ట్ చేయించుకునే అవకాశం ఉందని అంటున్నారు. చిరంజీవి గతంలో ఒక పెళ్ళికి కూడా హాజరయ్యారు. సింగర్ రఘు కుంచె కుమార్తె వివాహానికి చిరంజీవి తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. దీంతో బహుశా అక్కడ సోకి ఉండవచ్చని అంటున్నారు.