బన్నీ చేస్తున్న సాహసం మామూలుది కాదు..

Join Our Community
follow manalokam on social media

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై ముందునుంచీ అంచనాలు భారీగానే ఉన్నాయి. వీరిద్దై కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం కావడంతో మరీ ఎక్కువగా ఉన్నాయి. ఐతే పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత ఈ విషయం అర్థమైంది. పూర్తి మాస్ గెటప్ లో బన్నీని చూసిన వారందరూ షాకయ్యారు. ఆ షాక్ ని మరింత ఎక్కువ చేసింది మాత్రం ఈరోజు రిలీజ్ అయిన రిలీజ్ డేట్ పోస్టరే.

ఫస్ట్ లుక్ లో ఏదో మాస్ గా చూపించారులే మరీ అంతలా ఉండకపోవచ్చు అనుకునేవాళ్ళకి షాక్ ఇచ్చేలా మరింత నాటుగా రిలీజ్ డేట్ పోస్టర్ మీద కనిపించాడు. చేతిలో గొడ్డలి, చింపిరి జుట్టు, చూస్తుంటే క్యారెక్టరే తప్ప అల్లు అర్జున్ కనిపించనంతగా ఉంది ఆ పోస్టర్. తెలుగులో మరీ ఇంత ఊరమాస్ గా ఇప్పటి వరకూ ఎవరూ కనిపించి ఉండరు. మాస్ సినిమాలు తీస్తారు కానీ సినిమా కోసం మరీ ఇంత డీగ్లామరస్ గా కనిపించే సాహసం ఎవరూ చేసి ఉండరు. కానీ ఆ సాహసం బన్నీ చేస్తున్నాడు.

పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతున్న చిత్రంలో బన్నీ మేకోవర్ అద్భుతంగా ఉంది. మాస్ సినిమాలకి మార్కెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ అంశం పుష్ప సినిమాలో నూటికి నూటయాభై శాతం ఉంది. సుకుమార్ దర్శకత్వం పుష్ప సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...