ఇలా చేస్తే కష్ట సమయంలో కూడా ఒత్తిడి లేకుండా ఉండవచ్చు…!

Join Our Community
follow manalokam on social media

జీవితం అంటే కష్ట సుఖాల సమరం. ఒకసారి కష్టం ఉంటే మరొకసారి ఆనందం ఉంటుంది. అయితే కష్టాల్లో కూడా ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఆ కష్టాలు నుండి బయటపడాలంటే ఈ మార్గాలని అనుసరించండి. మామూలుగా అయితే చాలా మంది కష్టాల్లో కుమిలిపోవడం… కష్టాలని ఎదుర్కో లేక అనేక ఇబ్బందులు పడటం.. ఎంతో సులువైన విషయాలని కూడా కష్టాలుగా భావించడం వంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కష్ట సమయాల్లో ఆచితూచి అడుగులు వేసి చక్కటి విధానాలు పాటిస్తే ఏ ఒత్తిడి లేకుండా కష్టాల నుండి సులువుగా బయట పడొచ్చు. మరి ఇంక ఆలస్యం ఎందుకు టిప్స్ ని ఇప్పుడే చూసేయండి. కష్ట సమయంలో ఒత్తిడి లేకుండా బయట పడాలంటే…

ఆ క్షణాన్ని స్వీకరించడం:

ఏమైనా కష్టాలు వచ్చినా కూడా వాటిని తీసుకుంటూ ఉండాలి. ఆ నిజాన్ని ఒప్పుకోవాలి. ఈ కష్టాన్ని కంట్రోల్ చేయగలను అని నమ్మకం మీలో మీకు ఉండాలి. ఎప్పుడైతే మీరు వాటిని కంట్రోల్ చేయగలను అని నమ్మకం పెట్టుకుంటారో అప్పుడు మీరు ఆ కష్టాన్ని ఎదుర్కోగలరు.

మధ్యలో రాకండి:

కష్టాల్లో ఉన్నప్పుడు మధ్య లోనే బయటకు వచ్చేయకండి. చాలా మంది ఏదైనా పని మొదలు పెట్టి, ఏమైనా కష్టం వస్తే దాని నుంచి వదిలేయడం చేస్తూ ఉంటారు. కానీ అది ఎంత మాత్రము కరెక్ట్ కాదు. ఎప్పుడైతే కష్టాలని ధైర్యంగా ఎదుర్కోగలను అని మీరు అనుకుంటే… అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలరు. కాబట్టి కష్టాలు వచ్చినా దాని నుంచి బయటికి వచ్చేయకండి. దీని వల్ల మీ గోల్ కూడా పోతుంది.

సమస్య కలిగించే వారి నుంచి దూరంగా వచ్చేయండి:

చాలా సందర్భాల్లో పక్కన ఉన్న వారు, నమ్మిన వారు చిన్నచిన్న మోసాలు చేయడం లేదా ఇబ్బందులు కలిగించడం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ల నుంచి దూరంగా వచ్చేయండి.

మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోండి:

వేళకి తినడం, వేళకి పడుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, యోగా, ప్రాణాయామం వంటివి చేయడం చేస్తూ ఉంటే ఎంతటి ఒత్తిడినైనా ఎంతో సులువుగా ఎదుర్కొనవచ్చు.

మోటివేషన్ మీకు మీరు ఇవ్వండి:

నేను చేయగలను, నేను ఎంతో సులువుగా ఈ కష్టాల నుండి బయట పడగలను అని మీపై మీరు నమ్మకం ఉంచుకుని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. లేదా మిమ్మల్ని మోటివేట్ చేసే వ్యక్తులతో సమయాన్ని గడపండి.

చిన్న విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోండి:

కష్టాల్లో ఉన్నప్పుడు ఏవైనా చిన్న గెలుపు వచ్చినా దానిని ఎంతో ఆనందంగా స్వీకరించి దానిని సెలబ్రేట్ చేసుకోండి. దీనివల్ల పాజిటివిటీ పెంచుకోవచ్చు.

TOP STORIES

జీవితంలో గెలవడానికి అలవర్చుకోవాల్సిన ఐదు అలవాట్లు..

కొన్ని అలవాట్లు మన జీవితాలని మార్చేస్తాయి. అలాగే మరికొన్ని అలవాట్లు మనల్ని విజయ తీరాలకి దూరంగా పడవేస్తాయి. ఇంకొన్ని అలవాట్లు విజయ సంద్రంలో నిత్యం తడిచేలా...