తుఫాన్ గా మారిన వాయుగుండం.. భారీ వర్షాలు ?

-

ఇప్పటికే తమిళనాడుని నివర్ తుఫాన్ హడలెత్తించగా ఇప్పుడు మరో వాయుగుండం తుఫానుగా మారింది. దానికి బురేవి అని పేరు పెట్టారు. బంగాళాఖాతంలో ఈ బురేవి తుఫాను ఏర్పడింది. శ్రీలంకకు  400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రింకోమలీ వద్ద ఇది కేంద్రీకృతమై ఉంది. కన్యాకుమారి పంబన్ మధ్య ఈనెల నాలుగో తేదీన ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఈ తుఫాను ప్రభావంతో  ఈ రోజు నుంచి తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాల మేరకు సిబ్బంది రంగంలోకి దిగారు, గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు రాయలసీమ ఉత్తర కోస్తా ఆంధ్ర తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది,

Read more RELATED
Recommended to you

Latest news