క‌రోనాను 2 రోజుల్లోనే చంపుతున్న యాంటీ పారాసైటిక్ డ్ర‌గ్‌

-

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది. ప్ర‌పంచంలో అనేక చోట్ల ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ మొద‌లైంది. మ‌న దేశంలో ముంబై, ఢిల్లీ వంటి న‌గ‌రాల్లో సెకండ్ వేవ్ ప్ర‌భావం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో చ‌లి మ‌రింత పెరిగే కొద్దీ క‌రోనా తీవ్ర‌త ఇంకా ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. అందువ‌ల్లే అంద‌రూ వ్యాక్సిన్ ఎప్పుడు వ‌స్తుందా అని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే వ్యాక్సిన్ మాటేమోగానీ సైంటిస్టులు క‌రోనాను 2 రోజుల్లోనే పూర్తిగా చంపే ఓ యాంటీ పారాసైటిక్ డ్ర‌గ్‌ను గుర్తించారు.

this anti parasitic drug kills corona virus in 2 days

హెచ్ఐవీ, ఇన్‌ఫ్లుయెంజా, డెంగ్యూ, జికా వైర‌స్ ల చికిత్స‌కు ఉప‌యోగించే ఐవ‌ర్‌మెక్టిన్ అన‌బ‌డే యాంటీ పారాసైటిక్ డ్ర‌గ్ కేవ‌లం 2 రోజుల్లోనే క‌రోనాను పూర్తిగా చంపుతుంద‌ని, అలాగే స‌ద‌రు వైర‌స్ తాలూకు ఆర్ఎన్ఏను కూడా 48 గంట‌ల్లో నిర్మూలిస్తుంద‌ని తేల్చారు. డ్ర‌గ్‌ను తీసుకున్న 24 గంటల్లోనే క‌రోనా రోగులు చాలా వ‌ర‌కు కోలుకుంటార‌ని గుర్తించారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివ‌ర్సిటీకి చెందిన పరిశోధ‌కులు ఈ విష‌యాన్ని గుర్తించారు. వారి ప‌రిశోధ‌న తాలూకు వివ‌రాల‌ను యాంటీ వైర‌ల్ రీసెర్చ్ అనే జ‌ర్న‌ల్‌లోనూ ప్ర‌చురించారు.

అయితే ఐవ‌ర్‌మెక్టిన్ డ్ర‌గ్ క‌రోనాను ఎలా చంపుతుందో వారు ఇంకా గుర్తించ‌లేదు. కానీ దానిపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేసి ఆ విష‌యం కూడా తెలుసుకుంటామ‌న్నారు. కాగా ఇప్పటికే క‌రోనా వైర‌స్ చికిత్స‌కు వైద్యులు అనేక ఔష‌ధాల‌ను వాడుతుండ‌గా.. ఇప్పుడీ డ్ర‌గ్ మ‌రింత ఆశాజన‌కంగా క‌నిపిస్తోంది. దీంతో వైద్యులు ఈ డ్ర‌గ్‌ను వాడేందుకు ఆసక్తిని చూపించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే అందుబాటులో ఉంది క‌నుక దీనికి ప్ర‌త్యేకమైన అనుమ‌తులు ఏవీ అక్క‌ర్లేదు. మ‌రి దీన్ని వాడుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news