కాకినాడ కాజాకు అరుదైన గుర్తింపు..!!!

-

కాకినాడ పేరు చెప్పగానే చటుక్కున గుర్తొచ్చేది అక్కడ దొరికే కాకినాడ కోటయ్య కాజా. ఈ కాజా ఎంత ఫేమస్ అంటే విదేశాలకి కూడా ఈ కాజాని పార్సిల్ చేసుకుని తీసుకువెళ్తారు. రాష్ట్రం కాని రాష్ట్రానికి కూడా కాకినాడ కోటయ్య కాజా రుచులు వెళ్తాయంటే అతిశయోక్తి కాదు. విదేశాలలో వివిధ రాష్ట్రాలలో ఉన్న ఎంతో మంది తెలుగువాళ్ళు, అలాగే ఈ కాజా రుచి చూసిన వివిధ ప్రాంతాల వాళ్ళు ఈ కాజాకోసం ప్రత్యేకంగా వచ్చి మరీ తీసుకువెళ్తారు..అయితే ఇప్పుడు ఈ కోటయ్య కాజాకి అరుదైన గుర్తింపు గుర్తింపు లభించింది.

Related image

భారత ప్రభుత్వ తాపాలా శాఖ వారు ఈ కాకినాడ కోటయ్య కాజా పేరుతో స్టాంప్ మరియు పోస్టర్ కవర్ రిలీజ్ చేసింది. కాకినాడ కోటయ్య కాజా ఎంతో ఫేమస్ . 1890లలో కాకినాడ లో కోటయ్య అనే వ్యక్తి కాజాని మొట్టమొదటి సారిగా తయారు చేశారు.గొట్టంలా ఉంటూ ఎంతో రుచిగా ఉండే కాజా అనతికాలంలోనే ఎంతో ఫేమస్ అయ్యింది..ఆ రోజు మొదలు ఈ కాజా కి కోటయ్య కాజాగా పేరు వచ్చింది.

 

అయితే భారత తపాలా శాఖ ఈ కోటయ్య కాజాకి గుర్తింపు ఇవ్వడంతో కాకినాడ వాసులు ఉబ్బితబ్బిబ్బై పోతున్నారు. తఫాలాశాఖకి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాకినాడ కోటయ్య కాజా వారు సైతం తమకి వచ్చిన గుర్తింపు కి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది వివిధ ప్రాంతాలలో ఉండే వారికి కోటయ్య సంస్థ వారు ఆన్లైన్ లో కాజాగా బుకింగ్ సౌకర్యాన్నికల్పించారు కూడా..మరి ఇంకెందుకు ఆలస్యం కోటయ్య కాజా రుచి చూడని వారు ఓ పట్టుపట్టండి మరి…

 

 

Read more RELATED
Recommended to you

Latest news