మంటల్లో కాలిపోయిన బస్సు…!

-

ఉత్తరప్రదేశ్… కన్నౌజ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే, ఒక బస్సు ఫరూఖాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో రాజస్థాన్‌లోని జైపూర్‌కి వెళ్తోంది. కనౌజ్ జిల్లా చిలోయి గ్రామం దగ్గర వేగంగా వెళ్తున్న ఆ బస్సు, ఎదురుగా వస్తున్న ట్రక్కుని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా బస్సులో మంటలు అంటుకున్నాయి.

తెల్లవారు జామున కావడంతో ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. క్షణాల్లో మంటలు బస్సు అంతా వ్యాపించాయి. ట్రక్కుని కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే అసలు బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు అనేది తెలియలేదు.

ఈ ఘటనకు సంబంధించి అక్కడి పోలీసులు విచారణ చేపట్టగా, పొగ మంచే ప్రమాదానికి కారణమని అధికారులు గుర్తించారు. మంచువల్ల ఎదురుగా ట్రక్ వస్తున్న విషయాన్ని డ్రైవర్ గుర్తించలేకపోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మంటలు ఏ విధంగా చెలరేగాయి అనేది మాత్రం స్పష్టంగా తెలియదు. ట్రక్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండి ఉండవచ్చనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news