ఏపీలో బస్ రిజర్వేషన్ షురూ…!

-

లాక్ డౌన్ ఎత్తివేయాలని ఇప్పుడు కొందరు కోరుకుంటున్నారు. రైలు, బస్సు ప్రయాణాలు ఎప్పుడు మొదలవుతాయో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. ఇన్నాళ్ళు పనులు అన్నీ మానుకున్న జనాలు ఇప్పుడు ఎప్పుడు లాక్ డౌన్ ని ఎప్పుడు ఎత్తివేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 14 తర్వాత లాక్ డౌన్ ని ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది.

దీనితో లాక్ డౌన్ ని ఎత్తివేస్తే రైలు, బస్ రిజర్వేషన్లు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు బస్ రిజర్వేషన్ లను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొదలుపెట్టే ఆలోచనలో ఉంది. ఆర్టీసీలో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వచ్చింది. నాన్‌ ఏసీ బస్సులు మాత్రమే తిప్పాలని అధికారులు భావిస్తున్నారు. ఏసీ బస్సుల్లో అయితే కరోనా వైరస్ బ్రతికే అవకాశం ఉందని అంటున్నారు.

అందుకే నాన్ ఏసీ ఆలోచనలో ఉన్నారు. 15 రోజులుగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్‌ పొడిగించినా రిజర్వేషన్‌ సొమ్మును తిరిగి ఇస్తారని నమ్ముతున్న జనం ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్తే రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అమరావతి, ఇంద్ర, సూపర్‌ డీలక్స్‌, అల్ర్టా, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు ఉన్నాయి. విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు రిజర్వేషన్లు చేయిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news