ఫ్లిప్‌కార్డ్, అమెజాన్‌కు భారీ షాక్..!

-

ఈ-కామర్స్ సంస్థలు ప్రజల నుండి మంచి ఆదరణ పొందాయి. ఇక పండగ సీజన్స్ లో అదిరిపోయే ఆఫర్స్ ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తుంది. అయితే ఈ-కామర్స్ సంస్థల ఫెస్టివల్ సేల్స్ ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలకు భారీ షాక్ తగిలే అవకాశం ఉందన్నారు. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా CCI తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కర్నాటక హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టిపారేయాలని సీసీఐ సుప్రీం కోర్టుకు వెళ్లిందని తెలిపారు.

flipkart-amazon
flipkart-amazon

అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌పై దర్యాప్తును నిలిపివేస్తూ కర్నాటక హైకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సీసీఐ ఈ ఉత్తర్వులను కొట్టిపారేయాలని సుప్రీం కోర్టను ఆశ్రయించిందని తెలిపారు. అంతేకాకుండా ఇప్పుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT కూడా సీసీఐకి మద్దుతునిచ్చిందని పేర్కొన్నారు.

ఇక ఈకామర్స్ సంస్థలు ఏకపక్ష రీతిలో వ్యాపారం చేస్తున్నాయని సీఏఐటీ తెలియజేసింది. అంతేకాదు ఈ సంస్థలు ప్రొడక్టులను తయారీ ఖర్చు కన్నా తక్కువకే విక్రయిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా భారీ డిస్కౌంట్లు, బ్రాండ్లను చెప్పుచేతిలో పెట్టుకోవడం, గుత్తాధిపత్యం వంటి అనైతిక వ్యాపార విధానాలకు పాల్పడుతున్నాయని వివరించారు.

ఈ సందర్బంగా సీఏఐటీ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖందేల్వాల్ మాట్లాడుతూ.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ సేల్స్‌ను నిషేధించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈకామర్స్ బిజినెస్‌ కోసం ప్రత్యేకమైన రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలని సీఏఐటీ డిమాండ్ చేసిందన్నారు. అలాగే ఈకామర్స్ పాలసీని కూడా తీసుకురావాలని కోరారు.

అంతేకాక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఇప్పటికే ఫెస్టివల్ సేల్స్‌ను ప్రకటించాయని సీఏఐటీ గుర్తు చేసింది. ఇక ఈ సేల్స్‌‌పై జీఎస్‌టీ తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలా ఈకామర్స్ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. వ్యాపారం చేసే వారు తప్పు చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కానీ ఈ కామర్స్ సంస్థలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news