బిజినెస్ ఐడియా: రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ద్వారా అదిరే లాభాలు..!

-

మీరు ఏదైనా బిజినెస్ ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? ఆ బిజినెస్ ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియాని కనుక మీరు ఫాలో అయ్యారంటే మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి అవుతుంది. నిజానికి ఈ మధ్య కాలంలో చాలా మంది వ్యాపారాలను చేయాలని అనుకుంటున్నారు.

వ్యాపారాల ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని భావిస్తున్నారు. కొందరయితే ఉద్యోగాలకి గుడ్ బై చెప్పేసి వ్యాపారాన్ని మొదలు పెడుతున్నారు. ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి చూస్తే.. కేవలం తక్కువ పెట్టుబడితోనే ఈ వ్యాపారం మొదలు పెట్టొచ్చు. లక్ష లోపు పెట్టుబడి తో చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాటిలో రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ వ్యాపారం కూడా ఒకటి.

దీనికోసం మీరు మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్యానల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్ కి సప్లై చేయచ్చు. ఈ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ 30 శాతం సబ్సిడీని కూడా ఇస్తోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడానికి లక్ష రూపాయలు ఖర్చవుతాయి 30 వేలు సబ్సిడీ వస్తుంది కాబట్టి 70 వేల వరకు ఖర్చు అవుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ కూడా అదనంగా పొందొచ్చు. బ్యాంకులు కూడా ఈ వ్యాపారానికి లోన్ ఇస్తాయి. ఇలా కూడా మీరు డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. ఒక సోలార్ ప్యానల్ జీవితకాలం వచ్చేసి 25 ఏళ్ల వరకు ఉంటుంది. పదేళ్లకు ఒకసారి బ్యాటరీ మార్చుకుంటే సరిపోతుంది. బ్యాటరీ ఖర్చు 20000 రూపాయలు ఉంటుంది అయితే మీకు కావలసిన ఇంధనాన్ని వాడుకుని మిగతా ఇంధనాన్ని ప్రభుత్వానికి లేదా ఏదైనా కంపెనీకి గ్రిడ్ ద్వారా అమ్మచ్చు. నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఇలా మీరు వీటిని అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news