బిజినెస్ ఐడియా: టెన్షన్ లేని బిజినెస్..లక్షల్లో ఆదాయం..

-

డబ్బు సంపాదించాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే చేస్తున్న ఉద్యోగాలలో జీతాలు చాలక బిజినెస్ చేయాలనీ అనుకుంటారు. రిస్క్ లేకుండా మంచి ఆదాయం కోసం చూస్తున్న వారికి అద్భుతమైన ఐడియా.. మనదేశంలో మిరియాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇతర దేశాల్లో కూడా భారీగా ధర పలుకుతోంది. మేఘాలయకు చెందిన నానాద్రో బి. మారక్ అనే రైతు మిరియాలు పండిస్తూ.. భారీగా ఆదాయం పొందుతున్నారు..

ఎటువంటి రసాయన మందులు వాడకుండా.. కేవలం సేంద్రీయ ఎరువులను వాడితే మంచి నాణ్యత తో మిరియాలు ఉంటాయి. మన సొంత పొలం ఉంటే మంచి లాభాలను పొందవచ్చు. తొలి దశలో మొక్కల కోసం ఎలా లేదనుకున్న రూ. 10 వేలు పెట్టుబడి పెట్టాలి. దానికి 10 వేల మొక్కలు వస్తాయి. పొలంలో 8-8 అడుగుల దూరంలో నల్ల మిరియాలు మొక్కలను నాటాలి. రెండు మొక్కల మధ్య అంత దూరం ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది మొక్కలు పెరగడానికి ఉపయుక్తంగా ఉంటుంది.

ఇక చెట్టు నుంచి మిరియాలను తీసిన తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. మిరియాల గింజలను నీటిలో కొంతసేపు ముంచి.. ఆ తర్వాత ఎండబెట్టాలి. అప్పుడే గింజలకు మంచి రంగు వస్తుంది.కాస్త ఓపికతో శ్రద్ద తో చేసుకోవడం మంచిది.ముందుగా మార్కెట్ గురించి తెలుసుకోవాలి. కొన్ని కంపెనీలు ఇంటివద్దకు వచ్చి కొంటాయి. ఏడాది పొడవునా మిరియాలు కాస్తాయి.మిరియాల సైజు, రంగును బట్టి రేటు ఉంటుంది. తక్కువ పెట్టుబడి తో లక్షలు ఆదాయాన్ని సులువుగా పొందవచ్చు. ఈ బిజినెస్ ఆలోచన ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి.

Read more RELATED
Recommended to you

Latest news