బిజినెస్ ఐడియా: అగర్బత్తితో అదిరే లాభాలు.. పెట్టుబడి కూడా తక్కువే..!

-

ఎక్కువ మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు కూడా మంచిగా వ్యాపారాలని చేసి.. దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ వ్యాపారం చేస్తే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఈ వ్యాపారంలో ఉండదు. మరిక ఈ బిజినెస్ ఐడియా గురించి పూర్తి వివరాలు లోకి వెళితే.. తక్కువ పెట్టుబడి తో అగర్బత్తి వ్యాపారం మొదలు పెట్టి మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.

ప్రతి రోజు పూజ చేసి అందరూ అగర్బత్తి ఉపయోగిస్తూ ఉంటారు. వాడకం ఎక్కువగా ఉంటుంది కనుక డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అగరబత్తులు తయారు చేయడానికి మీరు మిషన్ ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 35 వేల రూపాయల నుండి మిషన్లు అందుబాటులో ఉంటాయి. మీకు నచ్చిన దానిని మీరు ఎంపిక చేసుకుని కొనుగోలు చేయవచ్చు.

అగర్బత్తి తయారు చేయడానికి మిక్సర్, డ్రైయర్ వంటివి అవసరం అవుతాయి ఆటోమేటిక్ మిషన్ ని కొనుగోలు చేస్తే మీకు త్వరగా అగరబత్తులు తయారు చేయడానికి అవుతుంది. ఈ మిషన్ ఖరీదు 90 వేల వరకు ఉంటుంది. అగరబత్తులు తయారు చేయడం కోసం గమ్ పౌడర్, వెదురు, బొగ్గు పొడి వంటివి కావాలి. ఇలా కావాల్సిన సామాన్లకి మొత్తం ఐదు లక్షల వరకు అవుతుంది .

అగర్బత్తి ని ఎలా తయారు చేయాలి అని అనుమానం మీకు కలిగితే ఒకసారి మీరు ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకోండి. ఆ తర్వాత బిజినెస్ మొదలుపెట్టి క్రమంగా లాభాలు పొందండి. మాములు మిషన్ తో మీరు రెండు వందల అగరుబత్తులని ఒకేసారి తయారు చేసుకోవచ్చు. అదే ఆటోమేటిక్ మిషన్ తో అయితే వంద కిలోల అగరుబత్తులను తయారు చేసేయచ్చు. చిన్నగా ఇంట్లో అయినా మీరు దీన్ని స్టార్ట్ చెయ్యచ్చు. మంచిగా లాభాలను పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news