ఏపీ ప్రభుత్వం విద్యా శాఖలో కొత్త పోస్టుల భర్తీకి శ్రీకారం చుడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మండలానికో మండల విద్యా శాఖాధికారి (ఎంఈఓ) ఉండగా… అదే హోదాలో మండల విద్యా శాఖాధికారి-2 (ఎంఈఓ-2) పోస్టును కొత్తగా సృష్టించేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు శనివారం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అకడెమిక్, నాన్ అకడెమిక్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఈ కొత్త పోస్టును సృష్టిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీలో దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఈ తరహాలో కొత్త పోస్టులను సృష్టించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో విద్యా శాఖలో పదోన్నతులు నిలిచిపోయాయి. వెరసి మండల విద్యా శాఖాధికారులపై మోయలేని భారం పడింది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉంటే… ఎంఈఓ-2 పేరిట కొత్త పోస్టులను సృష్టించిన ఏపీ ప్రభుత్వం… ఆ కేటగిరీలో ఒకేసారి 679 పోస్టులను భర్తీ చేసేందకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఇప్పటికే ఉన్న ఎంఈఓ-1 పోస్టుల్లో మరో 13 పోస్టులను ఏర్పాటు చేసేందుకు కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా సృష్టించిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే మొదలుకానున్నట్లు సమాచారం.