మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. అయితే వ్యాపారం చెయ్యాలంటే చాలా డబ్బు చాలా అవసరం అవుతాయి. అయితే డబ్బుల గురించి దిగులు చెందక్కర్లేదు. ఎందుకంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాపారాలను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను తీసుకు రావడం జరిగింది. ఇక మరి మనం ఆ పథకాల గురించి చూసేద్దాం.
ముద్రా లోన్:
బిజినెస్ చెయ్యాలని అనుకునే వాళ్లకి ముద్రా లోన్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే చాలా మందికి ప్రభుత్వం రుణాలు ఇచ్చింది. ఈ పథకం వలన తక్కువ వడ్డీ, తక్కువ నిబంధనలతో రుణాలు ఇవ్వడం జరుగుతుంది. దీని కోసం మీరు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేదా బ్యాంక్‌కు వెళ్లి ఈ పథకానికి దరఖాస్తు చేసుకుని రుణం పొందవచ్చు.
స్టాండ్ అప్ ఇండియా:
అదే విధంగా స్టాండ్ అప్ ఇండియా కూడా బాగా ఉపయోగపడుతుంది. కొత్త ప్రాజెక్టు కోసం బ్యాంక్ ద్వారా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగకు చెందిన మహిళా రుణగ్రహితకు రూ.10 లక్షల నుంచి ఒక కోటి రూపాయల రుణం ఇవ్వడం దీని లక్ష్యం. అలానే ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా కూడా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు డబ్బులు పొందొచ్చు.
ఎంఎస్ఎంఈ స్కీమ్:
ఇక ఈ స్కీమ్ గురించి చూస్తే… మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ వ్యాపారాలను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. వ్యాపారం ప్రారంభించడానికి స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఇలకు దాదాపు రూ. 2 కోట్ల వరకు రుణాలు ఇవ్వడం ఈ స్కీమ్ లో జరుగుతుంది.