సెల్ఫీ కాఫీ ప్రింటింగ్ మెషీన్‌తో వ్యాపారం.. నెలకు రూ.70 వేలకు పైగా ఆదాయం..!

-

డబ్బు సంపాదించడం అనేది ఈరోజుల్లో అంత కష్టమైన పని కాదు.. కానీ నీతిగా, సుఖంగా సంపాదించగలగడమే పెద్ద విషయం. నెల నెల వచ్చే జీతంకన్నా.. సొంత వ్యాపారం మీద వచ్చే ఆదాయమే మనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది. తక్కువ పెట్టుబడిలో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనలో ఉంటే మీకోసమే ఈ ఐడియా..! ఈ వ్యాపారాన్ని కేవలం 50వేల రూపాయలతో ప్రారంభిచవచ్చు. మీకు ప్రతి నెలా రూ.70వేల వరకు ఆదాయం వస్తుందట.. ఇంతకీ ఆ వ్యాపారం ఏంటంటే…

రోడ్డు మీదకు వెళ్తే మనకు ఎన్నో టీ స్టాల్స్ కనిపిస్తాయి. కానీ ప్రత్యేకంగా కాఫీ మాత్రమే ఉండే.. అందులోనూ రకరకాల వెరైటీలను అందించే.. దుకాణాలు తక్కువ సంఖ్యలో మాత్రమే ఉంటాయి. టీ స్టాల్స్‌లో రకరకాల టీలు ఉంటాయి.. అచ్చం టీ స్టాల్‌లానే.. కాఫీ షాప్‌ ప్రారంభిస్తే.. ఆ వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఒక మంచి ప్రాంతంలో.. జనాలను ఆకట్టుకునే విధంగా.. షాప్‌ను ప్రారంభిస్తే.. బాగా ఆదాయం వస్తుంది. కాఫీ షాప్‌ను ప్రారంభించాలంటే మీకు.. ముందుగా కాఫీ మెషీన్ అవసరం. అయితే మార్కెట్‌లో లభించే సాధారణ కాఫీ మెషీన్‌లను తీసుకోకుండా.. అదునాతన టెక్నాలజీ ఉన్న లేటెస్ట్ మోడల్ కాఫీ మెషీన్లను తీసుకోవాలి. ఈ యంత్రం మీ కాఫీ షాప్‌ను ప్రత్యేకంగా చేస్తుంది.

కాఫీ తయారు చేసే యంత్రం పేరు ఎస్ప్రెస్సో వెండింగ్ మెషిన్. భారత మార్కెట్‌లో వీటి ధర 20 వేల రూపాయల వరకు ఉంది. మీ షాపు జనాలను ఆకర్షించి.. వ్యాపారం బాగా జరగాలంటే… కాఫీ మెషీన్‌తో పాటు మరో యంత్రాన్ని కూడా కొనాల్సి ఉంటుంది. అదే సెల్ఫీ కాఫీ ప్రింటింగ్ మెషీన్ . ఈ యంత్ర సాయంతో మీరు కాఫీ పైభాగంలో మీకు నచ్చిన వారి ముఖాన్ని ప్రింటింగ్ చేయవచ్చు. అంటే కాఫీపై ఫొటో కనిపిస్తుందన్నమాట. కేవలం ఫొటోలే కాదు.. రకరకాల డిజైన్ల రూపంలో కాఫీని అందించవచ్చు. ఇలాంటి వాటిని యువత ఎక్కువగా ఇష్టపడతారు. కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలో.. ఇలాంటి కాఫీ షాప్‌ని ఏర్పాటు చేస్తే.. గిరాకీ బాగా ఎక్కువగా ఉంటుంది. కాఫీ యంత్రాలతో పాటు ఇతర ఖర్చులు కలిపితే.. కాఫీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మీకు 50 వేల వరకూ అవుతుంది.

మార్కెట్లో కాఫీ ధర వెరైటీని బట్టి రూ. 50 నుంచి రూ. 100 వరకు ఉంది. మీరు రోజుకు 100 కాఫీలు విక్రయిస్తే.. అటూ ఇటూగా రూ.7 వేల రూపాయలు వస్తాయి. అంటే నెలలో 2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో దుకాణం అద్దె, సిబ్బంది జీతం, ఇతర ఖర్చులన్నీ కలిపి లక్షా 30 వేల వరకు వస్తుందని అనుకుంటే.. అప్పుడు అన్నీ పోను మీకు ప్రతి నెలా రూ.70వేలు ఈజీగా మిగులుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బిజినెస్ అంతగా వర్కవుట్ కాదు. పెద్ద పెద్ద పట్టణాలు, నగరాల్లో ప్రారంభిస్తేనే ఇలా లాభాలు పొందవచ్చు. ఇంట్రస్ట్‌ ఉంటే.. ఒకసారి లోతుగా అధ్యయనం చేసి స్టెప్‌ తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news