వ్యాపారులు ఎమ్మెల్యే, ఎంపీలు అవుతున్నరు : తమ్మినేని వీరభద్రం

-

సీపీఎం ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు.వ్యాపారులు ఎంపీలు, ఎమ్మెల్యేలవుతున్నారని.. దీన్ని సీపీఎం ఖండిస్తుందని అన్నారు. భువనగిరి పట్టణంలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశంలో మాట్లాడుతూ….బీజేపీ గతంలో చేసిన వాగ్ధాలను అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ 8వేలకోట్లు, కాంగ్రెస్‌కు 2వేల కోట్లు విరాళాలు వచ్చాయని అన్నారు.

ఎలక్టోరల్‌ బాండ్లను సీపీఎం వ్యతిరేకించిందని తెలిపారు.పార్టీ మార్పు అనేది సాధారణమైందని.. అధికారంలో నుంచి పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్తే.. నాయకులు పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు. భువనగిరి సీపీఎం అభ్యర్థి జహంగీర్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తనను అభ్యర్థిగా ఎంపిక చేసిన నేతలకు జహంగీర్‌ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నప్పటికీ కూడా ప్రజలు అందరు కలిసి విరాళాలు వేసుకొని సర్పంచ్‌గా గెలిపించారన్నారు. పార్టీలు ఫిరాయించే వారికి బుద్ధి చెప్పాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news