రేపు ఉప్పల్ లో హైదరాబాద్ , ముంబై మ్యాచ్.. ఇవి తీసుకెళ్లొద్దు

-

ఐపీఎల్ 2024 17వ సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తమ హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో రేపు మ్యాచ్ ఆడనుంది. మొదటి మ్యాచ్‌లో పోరాడి పరాజయం పాలైనప్పటికీ ఈసారి హోమ్ గ్రౌండ్ లో సత్తా చాటేందుకు సిద్ధం అవుతుంది. దీంతో రేపటి మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియంలో రేపు రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు.స్టేడియంలోకి ల్యాప్టాప్, వాటర్ బాటిల్స్, బ్యానర్స్, లైటర్స్, సిగరెట్స్, బైనాక్యులర్స్ తీసుకెళ్లొద్దని పోలీసులు తెలిపారు. మ్యాచ్ ప్రారంభమయ్యే 3 గంటల ముందు నుంచి ప్రేక్షకులను అనుమతిస్తామని.. ఎవరైనా బ్లాక్ టికెట్స్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు . 2500 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ తరుణ్ జోషి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news