కేసులు ఉన్న వాళ్లకి టిడిపిలో టిక్కెట్లు.. దుమారం రేపుతున్న అభ్యర్థుల ఎంపిక..

-

ఫోర్జరీ, చీటింగ్, భూ కబ్జా, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టడం వంటి తీవ్రమైన కేసులు ఉన్నవారికి తెలుగుదేశం పార్టీలో ఎంపీ టికెట్లు దక్కుతాయా అంటే అవుననే సమాధానం వస్తుంది.. చంద్రబాబు ప్రకటించిన ఎంపీ అభ్యర్థులలో సగానికి సగం మంది నేర చరిత్ర కలిగిన వారే ఉన్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.. ఉమ్మడి విశాఖలో ముగ్గురు ఎంపీ అభ్యర్థులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అరకు ఎంపీగా గెలుపొందిన కొత్తపల్లి గీత అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఆమెపై పలు కేసులు ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 40 రెండు కోట్ల 79 లక్షల లోన్ తీసుకొని ఎగవేత కేసులోనూ ఆమెను సిబిఐ కోర్టు దోషిగా తేల్చింది.. కొన్నాళ్లపాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై బయటకు వచ్చారు. అనంతరం ఆమె గిరిజన మహిళ కాదని.. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో రిజర్వుడ్ నియోజకవర్గంలో పోటీ చేశారంటూ కొందరు కోర్టుకు వెళ్లారు..

విశాఖ ఎంపీ అభ్యర్థిగా ఉన్న భరత్ కూడా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. గీతం విశ్వవిద్యాలయం అక్రమ కట్టడం అని, భరత్ ప్రోత్సాహంతోనే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గీతం యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం ఇప్పటి వరకు 40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.. ఇంకా కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉంది..

కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ పై కూడా తీవ్రమైన ఆరోపణలు కేసులు ఉన్నాయి. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే సీఎం రమేష్ 2012లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 జూన్ 24 బిజెపిలో చేరారు. సీఎం రమేష్ పై ఐపీసీ 323 324 కింద కేసు ఉంది. అలాగే చిత్తూరు జిల్లాలో సారా వ్యాపారాల సైతం చేశారు. 2014 19 లో గండికోట ప్రాజెక్ట్ పెండింగ్ పనుల్లో అవకతవకలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు ఇటీవల నమోదయింది. ఫోర్జరీ సంతకాలతో భోగ సబ్ కాంట్రాక్టర్ ఒప్పందం కుదురుకొని 450 కోట్లు కొట్టేసారని సినీ నటుడు వేణు ఆయనపై ఫిర్యాదు చేశారు.. ఇలా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన ఎంపీ అభ్యర్థులపై తీవ్రమైన కేసులు అభియోగాలు ఆరోపణలో ఉండడం పై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకతమవుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news