కొత్త జెర్సీని రివీల్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య 28 వ మ్యాచ్ రేపు జరగనుంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీని రివీల్ చేసింది. రేపటి మ్యాచ్లో ఆ టీమ్ ప్లేయర్లు ఈ మెరూన్ రంగు జెర్సీలో బరిలోకి దిగనున్నారు. కోల్కతాలోని ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ మోహన్ బగాన్కు గౌరవార్థంగా లక్నో ఆటగాళ్లు ఈ స్పెషల్ జెర్సీ వేసుకోనున్నారు. ఇక ఈ ప్రత్యేక జెర్సీ పాన్ పసంద్ చాక్లెట్గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

కాగా, లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో మూడింట గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక కోల్‌కతా నైట్ రైడర్స్ ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ కోల్కత్తా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వేదికగా 7: 30 pm కి ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news