జైలు నుంచే మా ఎమ్మెల్యేలను కొంటున్నాడు: మాజీ డిప్యూటి సిఎం ఆవేదన

మాజీ ఉప ముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్ కుమార్ మోడీ సంచలన ఆరోపణలు చేసారు. ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ టార్గెట్ గా ఆయన ఈ విమర్శలు చేసారు. మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డియే ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని, ఎన్డియేలో చీలిక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు.

ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ లోని కెల్లీ బంగ్లాలో ఉంటున్న లాలూ ప్రసాద్ ఎన్‌డిఎ శాసనసభ్యులను సంప్రదించడానికి మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారని… మహాకూటమి ప్రభుత్వంలో మంత్రి పదవులను ఆఫర్ చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. నేను లాలూ ప్రసాద్ యాదవ్ కి ఫోన్ చేసి పిచ్చి వేషాలు వేయవద్దు అని హెచ్చరించా అని ఆయన అన్నారు. స్పీకర్ పదవికి సంబంధించి ఇప్పుడు ఎన్డియేలో విభేదాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.