అతి తీవ్ర తుఫాన్ గా మారిన నివర్.. మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్

-

నివర్ అతి తీవ్ర తుఫానుగా మారింది. చెన్నైకి ఆగ్నేయంగా 330 కిలోమీటర్ల దూరంలోని తుఫాన్ ఉందని అంటున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ వైపు ఈ తుఫాను దూసుకొస్తోంది. ఈ తుఫాను ధాటికి గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో ఈ నెంబర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పుదుచ్చేరి గవర్నమెంట్ అయితే ఏకంగా 144 సెక్షన్ విధించింది.

కర్ణాటక ప్రభుత్వానికి కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఐ యం డి హెచ్చరికల ప్రకారం కర్ణాటక తమిళనాడులో రేపు నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. బెంగుళూరు లో వరదలు వచ్చే అవకాశం కూడా ఉందని ఐ యం డి హెచ్చరించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్ లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నెల్లూరు జిల్లా కి భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. నెల్లూరు కర్నూలు చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news