వినూత్నంగా సీఎం జగన్ కు బర్త్ డే విషెస్…సముద్రంలో నుంచి శుభాకాంక్షలు తెలిపిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. నేడు జగన్మోహన్ రెడ్ది 49వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జగన్ అభిమానాలు, వైసీపీ కార్యకర్తలు, నేతల శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి.  2019లో 151 స్థానాలతో తిరుగు లేని విజయాన్ని అందుకుని ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. వీరంతా తమ సోషల్ మీడియా అకౌంట్లలో సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

వైసీపీలో కీలక నేత, ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి వినూత్నంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిక శుభాకాంక్షలు తెలిపారు. సముద్రంలో  స్కూబా డైవ్ చేస్తూ విషెస్ చెప్పాడు. నిన్న విశాఖలో పలు ప్రాంతాల్లో పర్యటించారు బైరెడ్డి సిద్ధార్డ్ రెడ్డి .. రిషి కొండ బీచ్ లో 30 అడుగుల లోతులో స్కూబా డైవ్ చేశారు. నీటిలో ఉంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ’’అడ్వాన్స్ హ్యపీ బర్త్ డే సీఎం సార్‘‘ అంటూ శుభాక్షాంక్షలు తెలిపారు బైరెడ్డి.