నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో షర్మిల పర్యటన

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత వైయస్ షర్మిల.. ప్రస్తుతం రైతు ఆవేదన పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే ఈ రైతు ఆవేదన యాత్రలో భాగంగా ఇవాల్టి రోజున.. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇలాక అయిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు.

ఇవాల్టి పర్యటనలో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను పరామర్శిస్తానని సిరిసిల్ల అధ్యక్షుడు చుక్కల రాము తెలిపారు. అలాగే గంభీరావుపేట మండలం ముచ్చర్ల, ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి, ఇల్లంతకుంట మండలం జ వారి పేట లో రైతు కుటుంబాలను వైయస్ షర్మిల పరామర్శించడం ఉన్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కూడా ఉంటుందని వివరించారు. ఇది ఇలా ఉండగా…. కామారెడ్డి జిల్లాలో నిన్న షర్మిల పర్యటించారు.