ఈ సేవలని బ్యాంక్ కి వెళ్ళక్కర్లేకుండా ATM నుండే పొందండి…!

కరోనా సమయంలో బ్యాంకు కి వెళ్లక్కర్లేదు. ఆ సర్వీసులు ఏటీఎం లోనే ఉపయోగించుకోవచ్చు. ఇప్పటి వరకూ ఏటీఎంలో డబ్బులుని విత్డ్రా చేసుకోవడానికి లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించి ఉంటారు.

కానీ ఏటీఎం ద్వారా ఎన్నో సర్వీసుల్ని పొందొచ్చు. బ్యాంకుల్లో క్యూలో నిల్చుని పనులు పూర్తి చేసుకోవాలి అదే ఏటీఎం దగ్గర క్షణాల్లో పనులు పూర్తి చేసుకోవచ్చు. అయితే ఈ రోజు ఏటీఎం లో ఎలాంటి సర్వీసులు పొందొచ్చు అనేది చూద్దాం…!

పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు:

ఏటీఎం ద్వారా ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీల తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి లైఫ్ మరియు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంని ఇప్పుడు ఏటీఎం ద్వారా కూడా చెల్లించవచ్చు.

ఏటీఎంలో లోన్ కి అప్లై చేయడం:

ఏటీఎం నుండి మీరు లోన్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఐసిఐసిఐ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎటిఎం నుంచి లోన్ కోసం అప్లై చేసుకోవడం సులభం.

క్యాష్ ట్రాన్సక్షన్ చేసుకోవడం:

ఏటీఎం ద్వారా క్యాష్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. ఒక రోజులో ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ని కూడా చేసుకోవచ్చు.

క్యాష్ డిపాజిట్ చేయడం:

ఇప్పుడు చాలా బ్యాంకుల ఏటీఎం లో క్యాష్ డిపాజిట్ మిషన్స్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు.

బిల్ పే చేయడం:

టెలిఫోన్, ఎలక్ట్రిసిటీ గ్యాస్ మొదలైన బిల్లులు ఏటీఎం ద్వారా మీరు చెల్లించుకో వచ్చు. అయితే ఇవి చేసేముందు బ్యాంక్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది.

మొబైల్ రీఛార్జ్:

మీకు సమీపంలో ఉండే ఎటిఎం నుంచి మీరు ప్రీపెయిడ్ బిల్లు చెల్లించొచ్చు.

చెక్ బుక్ రిక్వెస్ట్ పెట్టుకోవడం:

మీకు చెక్ బుక్ కావాలా…? అయితే మీరు బ్యాంకు కి వెళ్లక్కర్లేదు. ఏటీఎం ద్వారా కూడా మీరు కొత్త చెక్ బుక్ కోసం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు.